- Advertisement -
తెలంగాణలో మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్ సడలింపు ఇచ్చారు. తెలంగాణ కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయించారు. ప్రగతి భవన్‌లో సుధీర్ఘంగా భేటీ అయిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో వానాకాలం పంటలు, సాగునీటి అంశాల పై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్‌డౌన్ విషయంపైనా సమావేశంలో చర్చించారు. దీంతో పాటు పలు ఇతర అంశాలు కూడా చర్చించారు.
- Advertisement -