- Advertisement -
జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలింగ్ ముగియడంతో వైన్స్, బార్లు, రెస్టారెంట్లు మళ్లీ తెరుచుకున్నాయి. మద్యం షాపుల ముందు మందు బాబులు క్యూ కట్టారు. నవంబర్ 29వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ 01వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపివేశారు. ఇక గురువారం ఓల్డ్ మలక్‌పేట్‌లో రీపోలింగ్ నిర్వహించనున్నారు. రీ పోలింగ్ వల్ల ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్‌పోల్స్‌పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈనెల 4న ఓట్లు లెక్కింపు జరగనుంది. కాగా పోలింగ్ ఈ సారి మందకొడిగా సాగింది.
- Advertisement -