ఓటు హ‌క్కు వినియోగించుకున్న సినీ సెలబ్రిటీలు వీరే..

187
chiru
- Advertisement -

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల పోలింగ్ గత ఏడాది కన్న తక్కువగానే నమోదైంది. ఉద‌యం 7 గంట‌ల నుండి సాయంత్రం 6గంట‌ల వ‌ర‌కు ఓటింగ్ జ‌రిగింది. ఇందులో భాగంగా టాలీవుడ్‌ ప్రముఖులు తమ ఓటు హక్కును వినిమోగించుకున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి త‌న స‌తీమ‌ణి సురేఖ‌తో క‌లిసి ఫిలింన‌గ‌ర్ క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు చేశారు. ప్ర‌ముఖ నిర్మాత శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి, ద‌ర్శ‌కుడు క్రిష్‌, యాంక‌ర్ ఝాన్సీ, న‌టుడు ఆలీ, సినీ ర‌చ‌యిత ప‌ర‌చూరి గోపాల‌కృష్ణ‌, నిర్మాత ఉషా ముళ‌పారి కూడా త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

అక్కినేని నాగార్జున‌, ఆయ‌న స‌తీమ‌ణి అమ‌ల ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. జూబ్లిహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో వీరు ఓటు వేశారు. న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ కూడా ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. మంచు ల‌క్ష్మీ ఫిలిం న‌గ‌ర్ క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. విజయ్ దేవరకొండ సహా ఆయన కుటుంబ సభ్యులు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ జూబ్లీహిల్స్ లో ఓటు వేశారు. డైరెక్టర్ తేజ, కోట శ్రీనివాస రావు, రైటర్ బీవీఎస్ రవి, హీరో రామ్, నిఖిల్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ త‌దిత‌రులు ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్‌ మధ్యాహ్నం తర్వాత కాస్త పుంజుకుంది. మొత్తం 150 డివిజన్లలో కొన్ని స్థానాల్లో మాత్రమే పోలింగ్‌ 50 శాతం దాటింది. కొన్ని చోట్ల కనీసం పోలింగ్‌ 15 శాతం కూడా చేరకపోవడం గమనార్హం. కాగా, ఈ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే ఎన్నికలు ముగిసిన తరువాత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -