హీరో విక్రమ్‌తో రాశీ రొమాన్స్‌!

194
Raashi Khanna
- Advertisement -

హీరోయిన్‌ రాశిఖన్నా అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తెలుగు సినిమా రంగంలోకి ఈ ముద్దుగుమ్మ కథానాయికగా దూసుకుపోతుంది. ఇటీవలి కాలంలో ‘వెంకీమామ’, ‘ప్రతి రోజు పండగే’ వంటి హిట్ సినిమాలలో నటించింది ఈ భామ. తరువాత ఈ అమ్మడికి టాలీవుడ్ నుంచి అంతగా ఆఫర్లు లేవనే చెప్పాలి.

అయితే, తమిళంలో మాత్రం ఆమె బిజీగా వుంది. ప్రస్తుతం అక్కడ మూడు నాలుగు సినిమాలలో నటిస్తూ మంచి ఫామ్‌లో వుంది. ఈ క్రమంలో స్టార్ హీరో విక్రమ్ సరసన కథానాయికగా నటించే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు వచ్చినట్టు తెలుస్తోంది. భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వంలో స్టార్ హీరో విక్రమ్ ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో రాశీ ఖన్నాను హీరోయిన్ గా ఎంచుకున్నట్టు తాజా సమాచారం.

- Advertisement -