ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ మధ్య రకుల్ కు అన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ లోనే నటిస్తోంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ త ఓ రకుల్ మంచి పేరు వచ్చింది. ఆ తరువాత ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్లే. రామ్ చరణ్,రవితేజ, జూనియర్ ఎన్ టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలతో నటించింది ఈ భామ. ఇప్పుడు తొలిసారి మహేష్ బాబుతోనే జోడికట్టింది. నాగచైతన్య హీరోగా సోగ్గాడే చిన్నినాయన ఫేం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనూ రకుల్ ను ఎంపిక చేశారు.
అయితే ఈ సినిమాలో రెండో హీరోయిన్ కు అవకాశం ఉండడంతో రీసెంట్ గా లావణ్య త్రిపాఠిని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. లావణ్య త్రిపాఠీ అక్కినేని ఫ్యామిలీ మూవీ మనంలో గెస్ట్ రోల్ చేసింది. ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నాగ్ సరసన నటించింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ మరోసారి అక్కినేని హీరోతో నటించనుంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. మరోవైపు సురేష్ ప్రొడక్షన్స్ లో నాగచైతన్య హీరోగా సింగ్ వెర్సెస్ కౌర్ అనే పంజాబీ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ రీమేక్ లోను లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా చేయనున్నట్ల తెలుస్తోంది. మొత్తానికి అక్కినేని ఫ్యామిలీ అండతో లావణ్య త్రిపాఠి టాప్ హీరోయిన్లకు దఢ పుట్టిస్తోంది.