హీరోగా ఎంట్రీ ఇస్తున్న శ్రీహరి కుమారుడు..

447
SRihari son Meghansh
- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ యాసలో మాట్లాడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు శ్రీహరి. హీరో, విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో ప్రత్యేకమైన భాషతో సందడి చేశాడు. శ్రీహరి లేని లోటు తెలుగు ఇండస్ట్రీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుందిని చెప్పుకోవాలి. ఇక తాజాగా శ్రీహరి లేని లోటును తీరనుందని అనుకోవాలి. ఎందుకంటే ఆయన పెద్ద కుమారుడు మేఘాంశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. కొన్నాళ్ళ పాటు న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకున్న ఆయ‌న హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడ‌ట‌.

మేఘాంశ్ హీరోగా రాజ్ దూత్ అనే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతుంది. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, కార్తీక్ – అర్జున్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈచిత్ర రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుందని తెలుస్తుంది. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు శ్రీహరి. మరి ఆయన తనయుడు ఏవిధంగా ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి.

- Advertisement -