అరవింద సమేత కాంబినేషన్ రిపీట్…

273
ntr-trivikram

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ లో చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఒకే స్క్రీన్ పై కనిపించడంతో ఈమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానయ్య నిర్మిస్తున్న ఈమూవీని 2020 ఎప్రిల్ 20న విడుదల చేయనున్నారు. ఈసినిమా షూటింగ్ మరో సంవత్సర కాలం పాటు ఉండటంతో ఎన్టీఆర్ మరో సినిమాలో నటించే అవకాశం లేకుండా పోయింది. ఇక ఈసినిమా తర్వాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా తీస్తాడా అన్నది ఆసక్తి నెలకొంది.

మొన్నటి వరకూ కొరటాల శివతో ఉంటుందని ప్రచారం జరిగిన..తాజాగా త్రివిక్రమ్ పేరు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ లో ఈవిషయం బయటకు వచ్చింది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈమూవీ భారీ విజయాన్ని సాధించింది. ఈసినిమాలో మేకింగ్ ఎన్టీఆర్ కు నచ్చడంతో మరోసారి త్రివిక్రమ్ తో సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నాడట ఎన్టీఆర్. త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నితో సినిమా చేస్తున్నాడు. ఈవార్తపై క్లారీటి రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.