ఆ సెక్సీ పోస్టర్‌ పై మంచు లక్ష్మి కామెంట్‌..

202

‘వంశీ’ దర్శకత్వంలో రూపొంది ఎన్నో సంచనాలు సృష్టించిన సినిమా ‘లేడీస్ టైలర్’. ఈ సినిమాకి సీక్వెల్ గా మళ్ళీ వంశీ దర్శకత్వంలో ‘ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’ రూపొందుతున్నది. ఇప్పుడు ఈ సీనియర్ దర్శకుడు వంశీ. ఫ్యాషన్ డిజైనర్ S/o లేడీస్ టైలర్‌ అంటూ ఇటీవలే ఆకట్టుకునే ప్రీలుక్‌తో ముందుకొచ్చాడు.

ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సుమంత్ అశ్విన్ హీరోగా అనీషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్ష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మెలోడి బ్రహ్మ “మణిశర్మ” సంగీతం సమకూర్చాడు.
 Lakshmi Manchu raises objection over Fashion Designer ...
తాజాగా రిలీజైన ప్రీలుక్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒకమ్మాయి చెస్ట్ దగ్గర కొలతలు తీసుకుంటున్న హీరో. అంతకంటే ఏం కావాలి.. సంచలనాలు క్రియేట్ చేయడానికి. ఉన్నపళంగా జనాలు తన సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఏం చేయాలో వంశీ అదే చేశాడు. దీంతో ఇప్పుడు ఈ సినిమా ప్రీలుక్ టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
 Lakshmi Manchu raises objection over Fashion Designer ...
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఫొటోపై మంచు లక్ష్మి మండిపడింది. “మనం అమ్మాయిలను ఇలా చూపించడం ఎప్పుడు మానేస్తామో” అంటూ లుక్‌పై కామెంట్ చేసింది. అయితే దీనిపై స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆమెకు మద్ధతు తెలిపింది. దీంతో వెంటనే ఈ సినిమా నిర్మాత మధుర శ్రీధర్  స్పందించి.. మంచు లక్ష్మీకి సమాధానం ఇచ్చాడు. “మేము ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పోస్టర్‌ను రిలీజ్ చేయలేదు. సినిమాలోని ఒక సన్నివేశం నుంచి ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేశాం” అంటూ ట్వీట్ చేశారు.

అయితే మరోవైపు మంచు లక్ష్మీ ట్వీట్‌పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఝమ్మందినాథం, గుండెల్లో గోదారి లాంటి సినిమాల్లో తాప్సీని బోల్డ్‌గా చూపించినప్పుడు స్పందించని లక్ష్మీ, ఇప్పుడు ఈ పోస్టర్‌ను తప్పు పడ్డటం ఏంటని ఆమెపై కామెంట్‌లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా పాటలను ఏప్రిల్‌లో విడుదల కానుండగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Lakshmi Manchu raises objection over Fashion Designer ...