టాలీవుడ్‌లో నటిగా, వ్యాఖ్యాతగా రాణిస్తున్న మంచి లక్ష్మి తాజాగా తన హోమ్ టూర్ వీడియోని అభిమానులతో పంచుకున్నారు. తన ఇంటిని ప్రేక్షకులకు చూసిస్తూ మరిసిపోయారు. ఇక ఈ వీడియోలో తన ఇష్టాయిష్టాలు, అభిరుచుల గురించి పంచుకున్నారు. అమెరికాలో తన ఇల్లు కాలిపోయిందని చెప్పారు. ఆ ఘటనలో ఒక్క పెయింటింగ్ మాత్రమే మిగిలిందని, అదంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఇప్పుడుంటున్న ఇంటిని తీసుకున్నట్టు చెప్పారు. సమయం మారేకొద్దీ ఆ ఇంట్లో మార్పులు చేర్పులు చేశానన్నారు.
తనకు పెయింటింగ్స్ అంటే ఎంతో ఇష్టమని ఆమె వివరించారు. తన కూతురుతో కలిసి పెయింటింగ్స్ వేస్తుంటానని, ఎప్పుడూ కథలు చదువుతూ కూర్చుంటానని తెలిపారు. టీ కలెక్షన్స్, ఫొటో కలెక్షన్స్, జ్యువెలరీ, పాదరక్షల కలెక్షన్ వంటి వాటిని ఆమె వివరించారు. తన ఇంట్లోని డైనింగ్ టేబుల్ కూ ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని, ఎంతో మంది నటులు, రాజకీయ ప్రముఖులు దానిపై భోజనం చేశారన్నారు. అందుకే దానిని చాలా భద్రంగా చూసుకుంటున్నానని ఆమె వివరించారు. మంచు లక్ష్మి తన యూట్యూబ్‌లో చానెల్‌లో హోమ్ టూర్ గురించి షేర్ చేసిన వీడియోని మీరూ చూసేయండి.