‘మాస్ట్రో’ నుండి త‌మ‌న్నా లుక్‌ రిలీజ్‌..

280
- Advertisement -

యూత్ స్టార్ నితిన్- తమన్నా- నభా నటేష్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ దర్శకుడు. శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఓటీటీలో విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం రోజున స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి తొలిసారి త‌మ‌న్నా లుక్‌ను యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో నితిన్ కూడా క‌నిపిస్తున్నాడు.

తమన్నా ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషిస్తోందని సమాచారం. తాజాగా రిలీజైన పోస్టర్‌లో నితిన్‌ను గ‌న్ చేత‌బ‌ట్టి త‌మ‌న్నా భ‌య‌పెడుతుంది. ఇంత‌కీ నితిన్‌, త‌మ‌న్నా మ‌ధ్య ఏం జ‌రిగింది.. నితిన్‌ని త‌మ‌న్నా ఎందుకు భ‌య‌పెడుతుందో తెలుసుకోవాలంటే మాస్ట్రో సినిమా చూడాల్సిందే. బాలీవుడ్ మూవీ అంధాదున్‌కు తెలుగు రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతోంది.ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.

- Advertisement -