నాగశౌర్య ‘ల‌క్ష్య’ నుండి స్పెషల్ పోస్టర్..

168

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో రూపొందుతోన్ననాగ‌శౌర్య 20వ చిత్రం ‘ల‌క్ష్య’. ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్నిసోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి,నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. తాజాగా ఈ మూవీ నుండి కొత్తపోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. స్వాతంత్య్ర దినోత్సవ స్పెషల్ గా రిలీజైన ఈ పోస్టర్ అంతర్జాలంలో వైరల్ గా దూసుకెళుతోంది.

ఈ చిత్రంలో పార్ధు అనే క్రీడాకారుడి పాత్రలో శౌర్య కనిపిస్తారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో అతడు ఒక స్టేడియంలో నిలబడి ఇండియా బ్లూజెర్సీ (పార్థు ఇండియా 11) ధరించి కనిపిస్తున్నాడు. పోస్టర్ లో సిసలైన ఆటగాడికి మరో రూపంలా ఉన్నాడు. చేతిలో బాణాలు గురిపెట్టేందుకు అస్త్రాల్ని రెడీ చేసుకుని అర్జునుడిలా కనిపిస్తున్నాడు. నరాలు మెలితిరిగిన హ్యాండ్ తో కనిపిస్తున్నాడు. ఇక నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కీల‌క పాత్రల‌లో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌లో ఉంది అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.