సోదరికి బర్త్‌ డే విషెస్‌ చెప్పిన కేటీఆర్‌,సంతోష్

574
mp santhosh
- Advertisement -

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కవితకు ఆమె సోదరులు మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. “హ్యాపీ బర్త్ డే పప్” అంటూ కవిత ముద్దుపేరుతో కేటీఆర్‌ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. “నీ జీవితంలో సంతోషం నిండాలని, మంచి ఆరోగ్యం, సుఖశాంతులు ఉండేలా దీవెనలు లభించాలని కోరుకుంటున్నా” అంటూ చెల్లిపై అపారమైన ప్రేమాభిమానాలు కురిపించారు.

ఆదరణీయ, దయగల నీలాంటి సోదరిని కలిగి ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని ఎంపీ సంతోష్‌ ట్విట్‌ చేశారు. నీవు చూపే ప్రేమానురాగాలు ఎప్పటికీ మరిచిపోలేనని, ఆ భగవంతుడి ఆశీర్వాదం సమృద్ధిగా లభించాలని ఆకాంక్షించారు. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతోపాటు ప్రజాసేవలో చిరకాలం ఉండేలా భగవంతుడు దీవించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.

- Advertisement -