అసెంబ్లీలో కవితక్క జన్మదిన వేడుకలు..

486
kavitha birthday
- Advertisement -

అసెంబ్లీలోని డిప్యూటీ స్పీకర్‌ ఛాంబర్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ స్పీకర్‌ టి. పద్మారావు గౌడ్‌ సమక్షంలో కవిత బర్త్‌డే వేడుకలు జరిగాయి. ఈ రోజు టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తున్న కే.కేశవరావు , కేఆర్ సురేష్ రెడ్డిల నామినేషన్ ఫైలింగ్ కార్యక్రమానికి కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.

kavitha 1

ఈ సందర్భంగా నామినేషన్ అనంతరం పలువురు మంత్రులు మరియు ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కవితక్క కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెతో కేక్ కట్ చేయించారు. ఈ వేడుకల్లో మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

kavitha 2

అలాగే కల్వకుంట్ల కవిత జన్మదినం సంధర్భంగా శాసనమండలి సభ్యులు, ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో మాజీ ఎంపీ కవిత పుట్టిన రోజు సందర్భంగా టిఆరేస్వి నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

kavitha 5

- Advertisement -