అలా చేస్తే రూ.70 లకే పెట్రోల్.. కే‌టి‌ఆర్ సవాల్ !

80
- Advertisement -

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఇందన ధరలు ఏ స్థాయిలో పెరుగిపోయాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ ధరలు వాహనదారుడి కళ్ళు బైర్లు కమ్మెల చేస్తున్నాయి. 2014 కంటే ముందు రూ. 70 లకు దిగువగానే ఉండే పెట్రోల్ ఉప్పుడు రూ.100 దాటి ఇంకా పరుగులు పెడుతోంది. డీజిల్ పరిస్థితి కూడా ఇంతే. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నప్పటికి, అటు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తోంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితిలోకి వెళ్లిపోయాయి. .

కేంద్ర ప్రభుత్వం విధించిన సెస్ పన్ను కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీజిల్, పెట్రోల్ పై ధరలు పెంచక తప్పడంలేదు. తాజాగా డీజిల్ పెట్రోల్ ధరలపై కేంద్ర మంత్రి హార్దిప్ సింగ్ పురి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెస్ట్ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, తమిళ్ నాడు, జార్ఖండ్, కేరళ వంటి రాష్ట్రాలు డీజిల్ పెట్రోల్ పై వ్యాట్ తగ్గించడం లేదని వెంటనే వ్యాట్ తగ్గించేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు ఒత్తిడి చేయాలని పార్లమెంట్ సభలో వ్యాఖ్యానించారు మంత్రి హర్ధిప్ సింగ్ పురి. అయితే ఆయన చేసిన వ్యాఖ్యాలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్ ట్విట్టర్ లో ఘాటుగా సమాధానం ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం విధించిన సెస్ పన్ను కారణంగా రాష్ట్రనికి రావలసిన 41 శాతం వాటా పొందలేకపోతున్నామని, సెస్ పన్ను రద్దు చేస్తే.. పెట్రోల్ రూ. 70 లకు, డీజిల్ రూ. 60 లకు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాం. సెస్ పన్ను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందా ? అంటూ ప్రశ్నలు సంధించారు. సెస్ పన్ను ద్వారా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 30 లక్షల కోట్లు వసూలు చేసిందని, ఇంక చాలదా ? అంటూ విమర్శలు చేశారు కే‌టి‌ఆర్. సెస్ పన్ను తొలగిస్తే.. భారతీయులందరికి ఉపశమనం కలుగుతుందని, అందువల్ల ముందు ఆదిశగా ఆలోచించాలని కేంద్రానికి సూచించారు కే‌టి‌ఆర్. మరి కే‌టి‌ఆర్ డిమాండ్ చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం సెస్ పన్ను తొలగిస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -