- Advertisement -
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారిగా జాతీయజెండాను ఎగురవేశారు కేటీఆర్. రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించారు కేటీఆర్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కార్యకర్తలతో విరివిగా కేటీఆర్ భేటీ కానున్నారు.
ఇప్పటివరకు పార్టీ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ భవన్‌లో స్వాతంత్ర్య,గణతంత్ర్య దినోత్సవ వేడుకలకు జాతీయజెండాను ఆవిష్కరించారు. తొలిసారిగా కేటీఆర్ జాతీయజెండాను ఆవిష్కరిస్తుండటంతో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
- Advertisement -