KTR:సికింద్రాబాద్‌లో గెలిచేది బీఆర్ఎసే

14
- Advertisement -

సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కి మద్దతుగా అంబర్ పేటలో ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలిచేది గులాబీ పార్టీనే అన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజలను కలిశారు కేటీఆర్.

ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఓటమి ఖాయం అన్నారు. మరోసారి హైదరాబాద్ నగర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే పద్మారావు గౌడ్ కి మద్దతు ఇవ్వాలని కోరారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పద్మారావు గౌడ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి చేసింది ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, స్థానిక కార్పొరేటర్లు, యువజన నాయకులు రామేశ్వర్ గౌడ్, ముఠా జై సింహ, డివిజన్ ప్రెసిడెంట్ భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:చర్మం నల్లబడుతుందా..ఇలా చేయండి!

- Advertisement -