ట్విటర్‌లో నెటిజన్లకు కేటీఆర్‌ షాకింగ్‌ సమాధానాలు..

239
- Advertisement -

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విటర్‌లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.45 గంటల వరకు ‘ఆస్క్‌ కేటీఆర్‌’ హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో ట్విట్టర్ వేదికగా ప్రజలతో మాట్లాడారు. ఈ సంభాషణలో అనేక అంశాలపై కేటీఆర్‌ సమాధానాలిస్తూ.. తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. దేశ, రాష్ట్ర రాజకీయాలు, రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు.. ఇలా అనేక అంశాలపై కేటీఆర్‌ సూటిగా, చతురతతో సమాధానాలిచ్చారు.

కేటీఆర్‌ సమాధానాలు చూడండి..

కఠిన పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్‌ చేసుకుంటారు?
కేటీఆర్‌: ప్రశాంతంగా ఉండటం. బుద్ధిబలంతో వ్యవహరించడం.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమం సమయంలో కొందరు హైదరాబాద్‌ బ్రాండ్‌ గురించి తప్పుగా మాట్లాడారు. అలా అన్నవారికి మీరిచ్చే కౌంటర్‌ ఏంటి?
కేటీఆర్‌: అలాంటి మాటలు హైదరాబాద్‌ బ్రాండ్‌ను దెబ్బతీయవు.

ప్ర: ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై మీ స్పందనేంటి సర్‌?
కేటీఆర్‌: ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ నివేదిక ప్రకారం తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

అక్షయ్‌, మోదీ ముఖాముఖిపై మీ అభిప్రాయం ఏంటి?
కేటీఆర్‌: నేను చూడలేదు. కానీ అక్షయ్‌ వేసుకున్న పింక్ ప్యాంట్‌ నచ్చింది.

KTR

సర్‌.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌళిక సదుపాయాలపై దృష్టిసారించవచ్చు కదా.. ఎందుకు ఓ సాధారణ వ్యక్తి ఏదన్నా సాయం కావాలంటే ట్విటర్‌లో ద్వారా మిమ్మల్ని సంప్రదించాల్సి వస్తోంది?
కేటీఆర్‌: ట్విటర్‌ అనేది మరో సదుపాయం మాత్రమే. కానీ మౌళిక సదుపాయాల మెరుగుపై నిరంతరం పనులు జరుగుతూనే ఉన్నాయి.

ఎంఎంటీఎస్‌ రెండో దశ కోసం మరిన్ని ఫండ్స్‌ ఎందుకు విడుదల కావడం లేదు?
కేటీఆర్‌: ఫండ్స్‌ విడుదల కావడంలేదని ఎవరు చెప్పారు? భాజపా తప్పుడు మాటలను నమ్మొద్దు.

తెరాసకు చెందిన ఇతర మంత్రులకు కూడా ట్విటర్‌ ఖాతాలుంటే బాగుంటుంది కదా..?
కేటీఆర్‌: చాలా మంది ఉన్నారు కదా..

సర్‌.. మతాలపై ప్రసంగాలు చేసేవారిని అరికట్టండి. దీని వల్ల మతఘర్షణలు, బాంబు పేలుళ్లు తగ్గుతాయని అనిపిస్తోంది.
కేటీఆర్‌: దాని వల్ల ఉపయోగం ఉంటుందని నేననుకోను.

సర్‌.. మున్సిపల్‌ కార్యాలయాల్లో లంచగొండితనాన్ని అరికట్టడానికి ఏమన్నా ప్లాన్‌ చేస్తున్నారా?
కేటీఆర్‌: నూతన మున్సిపల్‌ చట్టాన్ని తెచ్చి ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు యత్నిస్తున్నాం.

సర్‌.. ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ సినిమా చూశారా?
కేటీఆర్: లేదు సర్‌. నాకు ‘అవెంజర్స్‌’ గురించి ఏమీ తెలీదు.

ఇప్పటివరకు 100 ట్వీట్లు చేసినా.. కేటీఆర్‌ గారు ఒక్క రిప్లై కూడా ఇవ్వట్లేదు. మీరు రిప్లై ఇవ్వకపోతే నారా లోకేశ్‌ మీదొట్టు.
కేటీఆర్: మధ్యలో ఆయన ఏం చేశాడు బ్రదర్‌..

ఇమేజ్‌ టవర్స్‌ మాటేంటి సర్‌? యానిమేషన్‌ ఇండస్ట్రీకి ప్లాన్స్‌ ఏంటి?
కేటీఆర్‌: అండర్‌ కన్‌స్ట్రక్షన్‌ సర్‌..

మీరిప్పుడు ఏ శాఖకూ మంత్రి కాదు. అలాంటప్పుడు ఎందుకు ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాల్లో తలదూరుస్తున్నారు. కొందరు కలెక్టర్లు ఏ మంచి పని చేసినా మిమ్మల్ని ఎందుకు ట్యాగ్‌ చేస్తున్నారు? గ్లోబరీనా వివాదంలోనూ మీపేరు వినిపిస్తుంది? దీనిపై మీరేం చెప్పదలచుకున్నారు?
కేటీఆర్‌: నన్ను ప్రజలు ఎంచుకున్నారు. ప్రజలకు ఏదన్నా సమస్య వస్తే అధికారులకు సూచించే హక్కు నాకుంటుంది. దీని వల్ల ఇప్పుడు మీకొచ్చిన సమస్యేంటి? ఇక గ్లోబరీనా విషయమంటారా.. ఇంటర్‌ ఫలితాలు వెల్లడిలో అవకతవకలు జరిగాయని తెలిసే వరకూ నాకు అసలు గ్లోబరీనా అంటే ఏంటో కూడా తెలియదు.

ఇంటర్‌ వివాదంలో నాకేదో మోసం ఉందనిపిస్తోంది సర్‌. కావాలని చేసినట్లున్నారు కదా..?
కేటీఆర్‌: ఈ సమస్యను మరింత వివాదాస్పదం చేయొద్దు.

అన్నింటికీ సమాధానాలు ఇస్తున్నారు. పిల్లల విషయంలో మాత్రం మాట దాటేస్తున్నారు. ఇంటర్‌ బోర్డు విషయంలో కొంచెం క్లారిటీ ఇవ్వండి. మీపై మాకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకండి.
కేటీఆర్‌: ఏం క్లారిటీ ఇవ్వాలో మీరే చెప్పండి సర్‌. జరిగిన ఘటనల పట్ల నేనూ బాధపడుతున్నాను. ఇందుకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలి. నేనూ ఓ తండ్రినే. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల బాధను నేనూ అర్థంచేసుకోగలను.

సికింద్రాబాద్‌ నుంచి శామీర్‌పేట వరకు స్కైవే ఏర్పాట్లపై అప్‌డేట్స్‌ ఇవ్వండి సర్‌..
కేటీఆర్‌: మాకు కంటోన్మెంట్‌ భూమి రాగానే స్కైవే పనులు జరుగుతాయి.

ఏపీలో ఎవరు గెలుస్తారనిపిస్తోంది సర్‌?
కేటీఆర్‌: నాకు ఏపీ రాజకీయాలపై ఆసక్తిలేదండీ..

మీ నుంచి స్పందన రావాలంటే ఏం చేయాలి సర్‌?
కేటీఆర్‌: మంచి ప్రశ్న అడగాలి.

కే ఏ పాల్‌ గురించి ఒక్క మాట చెప్పండి సర్‌..
కేటీఆర్‌: ఆయన ప్రచార కార్యక్రమం చాలా వినోదాత్మకంగా ఉంది.

ఏపీ నుంచి ఎవరు సీఎం అవుతారు సర్‌?
కేటీఆర్‌: పోటీ చేసిన ఎమ్మెల్యేల నుంచి ఎవరైనా అవ్వచ్చు.

జగన్‌ సీఎం పదవికి అర్హుడని అనిపిస్తోందా?
కేటీఆర్‌: అది ఏపీ ప్రజలు నిర్ణయిస్తారు. ఈ విషయంలో నా అభిప్రాయం ఎందుకు?

- Advertisement -