వర్మ ను అడ్డుకున్న పోలీసులు.. వీడియో వైరల్

173
RGV

వివాదాల దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. ఈ చిత్రం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎలక్షన్‌ సందర్భంగా ఈ మూవీని ఏపీలో విడుదలను ఆపేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో ఎట్టకేలకు ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ రిలీజ్ సిద్ధమైంది. ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో విజయవాడలో ప్రెస్‌మీట్‌ పెట్టేందుకు సిద్ధం కాగా వర్మను పోలీసులు అడ్డుకున్నారు.

RGV

విజయవాడలో ఓ నోవాటెల్‌లో చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడంతో నడిరోడ్డు మీద ప్రెస్‌మీట్‌ పెడతానని ప్రకటించిన వర్మ, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుండి ప్రకాశ్ నగర్‌కు చేరుకున్న వర్మ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. ‘విజయవాడలోకి మిమ్మల్ని అనుమతించలేం. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి దయచేసి వెనక్కి వెళ్లిపోండి’ అని కోరారు. అయినా వర్మ వినకపోవడంతో ఓ పోలీస్ వాహనాన్ని ఎస్కార్ట్ గా ఇచ్చి బలవంతంగా గన్నవరం ఎయిర్ పోర్టుకు తిప్పిపంపారు. అయితే ఎయిర్‌ పోర్టులో వర్మను నిర్బంధించినట్లు తెలుస్తోంది. నేను పోలీస్ కస్టడీలో ఉన్నాను అంటు తాజాగా ఒక వీడియో షేర్ చేసిన వర్మ.