హంగామా వద్దు…డబ్బు వృధా చేయకండి

263
ktr
- Advertisement -

రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఉన్న ఫాలోయింగే వేరు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేటీఆర్‌ చూపే చొరవ అద్భుతం. ఓ వైపు ప్రభుత్వ,పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉంటునే మరోవైపు సోషల్ మీడియలో సైతం కేటీఆర్ యాక్టివ్‌గా ఉంటారు. ఎంతపెద్ద సమస్యైన తన దృష్టికి వస్తే పరిష్కరించడమే కాదు అధికారులను సైతం ఉరుకులు,పరుగులు పెట్టిస్తారు.

ఇక ఈ నెల 24న కేటీఆర్ 42వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పార్టీ శ్రేణులు,మిత్రులు,శ్రేయోభిలాషులకు ట్వీట్టర్ ద్వారా కీలక సూచన చేశారు. తన పుట్టినరోజు వృధా ఖర్చు చేయకుండా ఆ డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందచేయాలని సూచించారు.

అంతేగాదు అనుమతి లేకుండా పెట్టిన ఫ్లెక్సీలు,హోర్డింగ్‌లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడైనా హోర్డింగ్‌లు ఉంటే వాటిని తొలగించాలి కమిషనర్ జనార్దన్ రెడ్డి,మేయర్ బొంతు రామ్మోహన్‌ను కోరుతున్నానని తెలిపారు.

- Advertisement -