పౌరవిమానయాన శాఖతో తెలంగాణ ఎంవోయు

101

కొత్తగూడెంకు రీజనల్ కనెక్టివిటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర విమానయాన శాఖమంత్రి అశోక్ గజపతిరాజును కలిసిన కేటీఆర్‌…కొత్తగూడెం ఎయిర్ పోర్టుకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రీజనల్ కనెక్టివిటీ స్కీంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యమైందని తెలిపారు. ఈ మేరకు ప్రాంతీయ విమానయాన అనుసంధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పౌర విమానయాన శాఖ మధ్య ఒప్పందం జరిగిందని కేటీఆర్ వెల్లడించారు.

KTR Meets Minister Ashok Gajapathi Raju

బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద ఏవియేషన్ స్కిల్లింగ్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వాలని కోరినట్లు కేటీఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా విమానయాన రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయు కుదుర్చుకున్నామని చెప్పారు. విమానయాన రంగంలో నైపుణ్యత కూడా చాలా అవసరమన్నారు.

KTR Meets Minister Ashok Gajapathi Raju

అంతకముందు కేంద్ర మంత్రి అనంత్ గీతేతో కేటీఆర్ భేటీ అయ్యారు. కేటీఆర్‌తోపాటు మంత్రి జోగు రామన్న, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే బాపురావు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఆదిలాబాద్‌లో మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.