తెలంగాణ రాష్ట్రాన్ని ఈజ్ అప్ డూయింగ్ బిజిసినెస్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలిపిన అదికారులను అబినందించేందుకు ప్రభుత్వం తరపున పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామ రావు ఓ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని ఈ ఏడాది మొదటి స్థానంలో నిలపడంలో సహకరించిన ప్రతి అధికారికి మంత్రి ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు. మొదటి స్థానం దక్కడం ప్రతి అధికారి నిబద్దతకు నిదర్బనమన్నారు. ముఖ్యంగా వివిధ శాఖాధిపతులు, పరిశ్రమ శాఖ, ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారుల సహకారం, ప్రతి సారి సమీక్షలను నిర్వహించిన ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి రాజీవ్ శర్మ సేవలను అభినందించారు.
అయితే కేవలం ఓక్క ఎడాదిలో మొదటి స్థానం రావడం సరిపోదని, దేశంలోనే తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా మార్చాలని కోరారు. ఇందుకోసం వచ్చే ఏడాది కోరకు తీసుకోవాల్సిన చర్యలు, అంశాల మీద అధికారులతో చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చేందుకు ఈ ర్యాంకింగ్ ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. తెలంగాణ మొదటి ర్యాంకు ద్వారా తెలంగాణ ఏర్పాటుపైన అనేక దుష్పచారాలను తిప్పికొట్టిందన్నారు. పెట్టుబడులు పోతాయన్న దుష్పరాచారానికి ప్రభుత్వం సరైన సమాధానం ఇచ్చి కొత్త రాష్ట్రం ఒక విజయవంతమైన పరిణామాంగా దేశం ముందుకు నిలబెట్టిందన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో అందరం కలిసి చేసిన కృషి ఫలితమన్నారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం వచ్పేమూడేళ్లలో మరింత ముందుకు పోయేలా పని చెద్దామని, అదిశగా మరింత స్పూర్తితో పనిచేద్దామన్నారు. ఇందుకోసం దేశంలోని ఇతర ప్రాంతాల్లోని మంచి పరిపాలన విధానాలను అచరణలోకి తీకునేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉన్నదన్నారు. టిఎస్ ఐపాస్, ఇతర పాలసీను రూపొందించామని, అయితే విధానాలు రూపొందించడం చాలా సులభమని అయితే వాటిని వ్యవస్థికృతం చేయడం చాల ముఖ్యమన్నారు. ఇందుకోసం అందరం కలిసి ఒక టీంగా పనిచేద్దామన్నారు. సమావేశానంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్పి మాట్లాడుతూ అధికారులందరికి ధన్యవాదాలు తెలిపారు.