యువీ ఇంట పెళ్లిసందడి… 

178
Yuvraj and Hazel’s Pre-Wedding Party

భారత క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి, మోడల్‌ హజెల్‌ కీచ్‌తో ఇవాళ యువరాజ్‌ వివాహం జరగనుంది. ఇప్పటికే యువరాజ్‌ ఇంట పెళ్లి సందడి మొదలైంది. అతిథులు, స్నేహితులతో సందడి వాతావరణం నెలకొంది. మంగళవారం జరిగిన మెహందీ, సంగీత్‌ కార్యక్రమాల్లో నూతన వధూవరులు యువరాజ్‌, హజెల్‌ కీచ్‌ సందడి చేశారు. వీరికి టీమిండియా టెస్టు జట్టు కూడా తోడవ్వడంతో యువరాజ్‌ ఇంట పెళ్లి సంబరాలు అంబరాన్నంటాయి.

Yuvraj and Hazel’s Pre-Wedding Party

మ్యారేజ్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సంగీత్, మెహందీ ఫంక్షన్ లో మెరిసిపోయాడు యువీ. సంప్రాదాయ దుస్తుల్లో హేజల్ మెరిసిపోయింది.ఈ రోజు నుంచి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నా. మీ ప్రేమకు కృతజ్ఞతలు. కొత్త జంటను ఆశీర్వదించండి అంటూ ట్వీట్ చేశాడు యువీ.

Yuvraj and Hazel’s Pre-Wedding Party

ఈ సందర్భంగా యువరాజ్‌, హజెల్‌ కీచ్‌ సోషల్‌మీడియా ద్వారా ఫొటోను అభిమానులకు షేర్‌ చేసి తమను ఆశీర్వదించాలని కోరారు. సింగర్‌ రంజిత్‌ భవా ఆధ్వర్యంలోని సంగీత్‌ కార్యక్రమం ఆద్యంతం సందడిగా సాగింది. చండీగఢ్ లో పంజాబీ సంప్రదాయంలో యువీ వివాహం చేసుకోనున్నాడు. ముందుగా 30న సిక్కు సంప్రదాయంలో.. డిసెంబర్ 2న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 5న చత్తార్ పూర్ లో సంగీత్, 7న ఢిల్లీలోని ఓ హోటల్ లో రిసెప్షన్ అరేంజ్ చేయనున్నారు.ఈ రోజు జరగనున్న వివాహానికి యువరాజ్‌ తండ్రి హాజరుకావడంలేదు.

The Quint: Yograj Singh, Virat Join Yuvraj and Hazel’s Pre-Wedding Party

Yuvraj and Hazel’s Pre-Wedding Party

Yuvraj and Hazel’s Pre-Wedding Party

Yuvraj and Hazel’s Pre-Wedding Party

Yuvraj and Hazel’s Pre-Wedding Party

Yuvraj and Hazel’s Pre-Wedding Party