- Advertisement -
తెలంగాణ వ్యాప్తంగా హరితహారం కార్యక్రమంలో పాల్గోంటున్నారు ప్రజలు.. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు.. పలు స్వచ్చంధ సంస్థలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గోంటున్నాయి. జిల్లాల్లో మంత్రులు, ప్రజాపతినిధులు, అధికారులు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. మాదాపూర్‌లో గల బర్డ్ పార్క్‌లో మంత్రి మంత్రి కేటీఆర్ పాఠశాల విద్యార్థులతో హరితహారంలో పాల్గొన్నారు. మొక్కలు నాటి నీళ్లు పోశారు. పర్యావరణానికి, పశు పక్షాదులకు ఇతోధికంగా మేలు చేసేందుకు హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభఙంచారన్నారు. పార్టీలకతీతంగా హరితహరంలో పాల్గోనాలన్నారు. రాజకీయం చేయడం తగదన్నారు. మొక్కలు నాటాలి.. వాటిని రక్షించాలన్నారు. పూర్తి స్థాయిలో అన్ని హంగులతో రాష్ట్రాన్ని నిర్మించాలని చూస్తున్నామన్నారు.
- Advertisement -