కేటీఆర్ బొమ్మ పొట్టుకున్నాడనే కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యల వలన రోడ్డున పడ్డ హోటల్ నిర్వాహకుడు, బాధితుడుశ్రీనివాస్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. తొందర్లోనే వస్తా దుకాణం కొత్తది పెట్టించి నేనే ఓపెన్ చేస్తానని తెలిపారు. తమ్ముడు శ్రీనివాస్ అధైర్యపడకు నీ కుటుంబ బాధ్యత నాది అంటూ భరోసానిచ్చారు.
కేవలం కేటీఆర్ ఫొటో ఉందనే నెపంతో కక్షగట్టిన రేవంత్త్ రెడ్డి ప్రభుత్వం అధికార అహంకారంతో ట్రేడ్ లైసెన్స్ లేదనే సాకుతో సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాటు వద్ద శ్రీనివాస్ నడుపుకుంటున్న చాయ్ దుకాణాన్ని రెండు రోజుల క్రితం సీజ్ చేశారు. అంతటితో ఆగని అధికారులు ఈరోజు క్రేన్ తో శ్రీనివాస్ చాయ్ డబ్బాను తొలగించి ట్రాక్టర్లో తీసుకెళ్లిపోయారు.
Also Read:పసుపుకు గిట్టుబాటు ధర ఏది?: ప్రశాంత్ రెడ్డి
చాయ్ హోటల్ నడుపుకుంటే కానీ పూట గడవని శ్రీనివాస్ కుటుంబం రోడ్డున పడింది. దీంతో స్పందించిన కేటీఆర్ బాధితుడి శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చారు.