కేటీఆర్ పుట్టినరోజున వినూత్నమైన ఛాలెంజ్..!

454
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కె టి రామారావు పుట్టినరోజు వేడుకలు ఈసారి మరింత వినూత్నంగా జరగబోతున్నాయి. కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ట్విట్టర్ వేదికగా ఒక వినూత్నమైన ప్రచారాన్ని ప్రారంభించారు. గిఫ్ట్ స్మైల్ ఛాలెంజ్ పేరుతో ట్విట్టర్ వేదికగా ప్రారంభించిన ఈ ప్రచారానికి విస్తృతమైన ఆదరణ లభిస్తోంది. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పూల బొకేలు పత్రికా ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్ల కోసం కాకుండా అవసరం ఉన్న పేద వారి కోసం లేదా సమాజంలోని వివిధ వర్గాలకి సాధ్యమైనంత మేర సహాయం అందించాలన్న ఉద్దేశంతో ఈ చాలెంజ్ ప్రారంభమైంది.

గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్ లో భాగంగా తమకు తోచినంత సహాయం తమ చుట్టుపక్కల ఉన్న వారికి సహాయం అందించి తమకు తెలిసిన వారిని నామినేట్ చేస్తున్నారు.ఇలా తాము నామినేట్ చేసిన వారు సైతం ఎంతో కొంత ఇతరులకు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే తమకు తోచిన మేర ఇతరులకు ఆర్థికంగా లేదా ఇతర మార్గాల్లో సహాయం అందిస్తున్నారు. కేటీఆర్ మిత్రులు, శ్రేయోభిలాషులతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సైతం ఈ గిఫ్ట్ స్మైల్ చాలెంజ్ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. మంచి ఉద్దేశ్యంతో ప్రారంభమైన ఈ ఆలోచనకు నెటీజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

ktr birthday

ఈ కార్యక్రమంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా భాగస్వామ్యవుతున్నారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఈ ఛాలెంజ్ స్వీకరిస్తూ 10 లక్షల రూపాయలను చెక్కును అంబులెన్స్ కొనుగోలు నిమిత్తం స్వచ్ఛంద సంస్థకు అందజేయడం జరిగింది. శిరీష్ రావు అనే ఎన్నారై అమెరికన్ కేన్సర్ సొసైటీకి 250 యూఎస్ డాలర్లను విరాళంగా అందజేశారు. దీనితో స్ఫూర్తి పొందిన అమెరికాలో ఉంటున్న మరో ఎన్నారై శశి కనపర్తి అనే కేటీఆర్ అభిమాని నిశాంత్ కేన్సర్ ఫౌండేషన్ కు 500 యూఎస్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. ఇలా ఎంతోమంది ఈ క్యాంపెయిన్‌లో ఎదో ఒకవిధంగా భాగసమ్యులు అవుతుండటంతో ఇప్పుడు ఇది ట్విట్టర్లో ట్రేండింగ్ అవుతోంది.

గతంలో మంత్రిగా పని చేసినప్పటి నుండి ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కేటీఆర్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వచ్చే తన దృష్టికి వచ్చే విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నరని, కనీసం నెలకి 20 నుండి 30 మందికి కేటీఆర్ ఈ విధంగా సహాయం అందిస్తున్నారని,ఈ నేపథ్యంలో కేటీఆర్ చేస్తున్న కార్యక్రమాల నుండి తాము కూడా స్ఫూర్తి పొందామని కనీసం సంవత్సరానికి ఒక్కరికైనా ఎంతోకొంత అవసరమున్న వారికి ఎదో ఒక రూపంలో సహకారం అందించాలన్న లక్ష్యంతో గిఫ్ట్ స్మైల్ కార్యక్రమాన్ని ప్రారంభించామని కేటీఆర్ అభిమానులు తెలియజేశారు. ఈ చాలెంజ్‌కి ఇప్పటికే పెద్ద ఎత్తున స్పందన వస్తుందని, సాధ్యమైనంత ఎక్కువ మందికి సహాయం అందితే అది తమ అభిమాన నాయకుడికి తాము ఇచ్చే నిజమైన బహుమతి అని పేర్కొన్నారు.

కేటీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకొని గిఫ్ట్ స్మైల్ ఛాలెంజ్ పేరుతో చేస్తున్న ఈ క్యాంపెయిన్ పట్ల మరింత స్పష్టత కోసంఎలాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చో కేటీఆర్ మిత్రులు, అభిమామానులు, పార్టీ కార్యకర్తలు, మిగితా వారికి సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

-అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి అవయవవాల కోసం ఆర్ధిక సాయం.
-రక్త దాన కార్యక్రమాలు లేదా అవయవ దానామ్ విషయంలో ప్రతిజ్ఞ తీసుకోవడం.
-వృద్దాప్య ఆశ్రమాలు లేదా అనాధ ఆశ్రమాలలో భోజన పంపిణీ.
-వృద్దాప్య ఆశ్రమాలు లేదా అనాధ ఆశ్రమాలకు విరాళాలు సమకూర్చడం.
-ప్రభుత్వ పాఠశాలలు లేదా ప్రభుత్వ దావఖానాల్లో రసాక్షిత మంచినీటి కోసం ఆర్వో ప్లాంటులను ఏర్పాటు చేయడం.
-ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు పుస్తకాలు లేదా నాట్ బుక్స్ అందజేయడం, లైబ్రరీలకు పుస్తకాలను అందించడం.
-ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకి అవసరమున్నవారికి ఆర్ధిక సాయం అందించడం.
-పేద ప్రజలకు వైద్యం కోసం సాయం చేయడం.
-ప్రభుత్వ దవఖానాల్లో మౌలిక వసతుల కల్పనాకు కృషి చేయడం.
-హరితహారం కోసం మొక్కలను నాటడం.
-కాలనీల్లో ఇంకుడు గుంతల ఏర్పాటు.
-అవసరమున్న చోట ప్రజల భద్రతా కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు తోడ్పాటును అందించడం.

ట్విట్టర్ వేదికగా మొదలుపెట్టిన ఈ ప్రచారానికి పార్టీ కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులే కాకుండా అన్ని వర్గాల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం కోసం కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ముందుకు రావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/shashikanthk/status/1153027883545300994

- Advertisement -