సర్‌ప్రైజ్‌.. కోవై సరళ పొలిటికల్ ఎంట్రీ

376
kovisarala
- Advertisement -

తమిళనాట సినీ హీరో,హీరోయిన్లు రాజకీయాల్లో చేరడం కామన్‌. ఎంజీఆర్,కరుణానిధి,జయలలిత,విజయ్‌ కాంత్ దగ్గరి నుండి సూపర్ స్టార్ రజనీ,కమల్ హాసన్ వరకు రాజకీయరంగ ప్రవేశం చేసిన వాళ్లే. తాజాగా వీరిజాబితాలో చేరిపోయింది కమెడియన్‌ కోవై సరళ.

సహజనటుడు కమల్ హాసన్ స్ధాపించిన మక్కల్ నీధి మయ్యం పార్టీలో చేరి కొత్త ఇన్నింగ్స్‌ని ప్రారంభించింది. కమల్ సమక్షంలో ఆమె పార్టీలో చేరగా కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందుకున్నారు.

kamal hassanరానున్న లోక్‌సభ ఎన్నికల్లో కమల్ పార్టీ తరపున ఆమె ప్రచారం చేయనున్నారు. కోయంబత్తూరు పరిసర కొంగునాడు ప్రాంతంలో ఆమెకు మంచిపట్టుఉంది. అంతేకాదు  కోవై సరళ మంచి వక్త కూడా.దీంతో కమల్ పార్టీకి ఆమె సేవలు ఎంతో ఉపయోగపడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కమెడీయన్‌గా తనదైన ముద్రవేసింది కోవై సరళ. ముఖ్యంగా బ్రహ్మానందంతో ఆమె చేసిన కామెడీ సినిమాలు చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే. ఇక కమల్‌హాసన్‌-కోవై సరళ కాంబినేషన్‌లో వచ్చిన సతీలీలావతి సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. తర్వాత కమల్ కాంభినేషన్‌లో చాలా సినిమాల్లో కోవై సరళ నటించారు.

- Advertisement -