అంగరంగవైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు …

239
yadadri brahmotsavalu 2019
- Advertisement -

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 18 వరకు బ్రహ్మోత్సవాలు జరగనుండగా మార్చి 14న ఎదుర్కోలు ఉత్సవం, 15న తిరు కల్యాణమహోత్సవం, 16న దివ్య విమానరథోత్సవం నిర్వహించనున్నారు. 15న ఉదయం బాలాలయంలో జరిగే తిరు కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.

అత్యంత ప్రాధాన్యత కల్గిన యాదాద్రి బ్రహ్మోత్సవాలను తిలకించడానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆగమశాస్త్రం ప్రకారం బ్రహ్మోత్సవాలను బాలాలయానికే పరిమితం చేస్తున్నారు.

అయితే పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా వైభవోత్సవ కల్యాణం, రథోత్సవాలకు మాత్రం కొండ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తొలుత మూడు రోజులపాటు నిర్వహించిన ఈ ఉత్సవాలు తర్వాత అయిదురోజులపాటు కొనసాగేవి. కాలక్రమంలో అవి పదకొండు రోజుల బ్రహ్మోత్సవాలుగా రూపుదిద్దుకున్నాయి.

గుహలో దేవేరితో కొలువుదీరిన పంచనారసింహుల దివ్యరూపం, ఆళ్వారుల ముఖమండపాలు,నలుదిక్కులా మాడవీధులు,సప్త గోపురాలు, కాకతీయుల సంప్రదాయాలను ప్రతిబింబించే కృష్ణశిలా శిల్పాల సోయగాలతో యాదాద్రి శోభాయమానంగా వెలిగిపోతోంది.

- Advertisement -