నన్ను పెళ్లిచేసుకుంటారా..!:సన్నీ

268
sunny leone
- Advertisement -

పోర్న్‌స్టార్‌ నుండి ఫిలింస్టార్‌ గా మారిన బ్యూటీ సన్నీలియోన్‌. ఈ సెక్స్ బాంబ్ సన్నీలియోన్ ఏం చేసినా సెక్సీగా ఉంటుంది. అందుకే సన్నీకి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. పోర్న్‌ సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బాలీవుడ్ లోనే కాదు సౌత్ లోను తన హవాను కొనసాగిస్తోంది.

సౌత్ లో ముఖ్యంగా కేరళలో సినిమాలు చేస్తున్న సన్నీ ఉమెన్స్ డే రోజున చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెడ్డింగ్ వౌస్ అనే మ్యాగజైన్ కు కలర్ ఫుల్ గా ఫోజులు ఇచ్చిన సన్నీ నన్ను పెళ్లిచేసుకుంటారా అని ట్వీట్ చేసింది. అంతేగాదు సన్నీ అంటే తప్పుగా అర్ధం చేసుకునే వాళ్లకు ఈ ఫోటోతో సమాధానం చెప్పింది. ఒక సాధారణ హీరోయిన్ ఎలా ఉండాలో అలా కనిపించి కనువిందు చేసింది.

ప్రస్తుతం సన్నీ రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న వీర‌మాదేవి అనే సినిమా చేస్తోంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు ప‌లు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని వి.సి.వడివుడయన్ తెరకెక్కించనుండగా, స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక‌ త్వరలోనే సన్నీ మ‌ల‌యాళం డెబ్యూ చిత్రం కూడా చేయబోతోంది. స‌న్నీ ప్ర‌ధాన పాత్ర‌లో బ్యాక్ వాట‌ర్ స్టూడియోస్ పతాకంపై ద‌ర్శ‌కుడు సంతోష్ నాయ‌ర్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు.

 

- Advertisement -