కోట బొమ్మాళి పీఎస్ చిత్రం నుంచి విడుదలైన లింగి లింగి లింగిడి అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు కొన్ని కోట్ల వ్యూస్ లభించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇటీవలే ఈ పాట 30 మిలియన్స్ వ్యూస్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రయూనిట్ సెలబ్రేషన్ నిర్వహించింది. 30 మిలియన్స్ కేక్‌ను ఈ సందర్భంగాకట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది చిత్రబందం. తెలుగులో ఇటీవల ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన గీతా ఆర్ట్స్ 2 సంస్థ. GA2 పిక్చర్స్ బ్యానర్ మలయాళ సూపర్ హిట్ నాయాట్టు కి రీమేక్ గా *కోట బొమ్మాళి పీఎస్* ను నిర్మించింది ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు.తేజ మార్నిదర్శకుడు. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ కు చక్కన స్పందన రాగా, ఇటీవల విడుదల చేసిన లింగి లింగి లింగిడి అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు కొన్ని కోట్ల వ్యూస్ లభించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. *తాజాగా ఈ సినిమా టీజర్ నవంబర్ 6న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది*. నవంబరు 24న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల చేస్తున్నారు మేకర్స్. పోలీస్ కు రాజకీయనాయకుడికి మధ్య జరిగే పవర్ ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలంగాణలో ఎన్నికలు జరిగే సమయంలో నవంబరు 24న విడుదల కానుండంతొో ఈ సినిమాపై అందరిలోనూ మరింత ఆసక్తి పెరిగింది. , జోహర్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ 30 మిలియన్స్ సెలబ్రేషన్ వేడుకలో పాల్గొన్న బన్నీవాస్ మాట్లడుతూ లింగి లింగి లింగిడి పాటకు వచ్చిన స్పందన అనూహ్యం. సోషల్ మీడియాలో వైరల్‌గా వున్న ఈ పాట భవిష్యత్ లో మరింత ఆదరణ నోచుకుంటుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు చక్కని స్పందన వస్తోంది. తప్పకుండా మా చిత్రానికి ప్రేక్షకులు విజయాన్ని అందిస్తారనే నమ్మకం వుంది. అన్నారు. పాట 30 మిలియన్స్ వ్యూస్ సాధించడం తమకెంతో ఆనందంగా వుందని, హీరో రాహుల్ విజయ్, హీరోయిన్ శివాని, నిర్మాత బన్నీవాస్, విద్యా కొప్పినీడి, దర్శకుడు తేజ మార్ని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రేక్షకులకు తమ థ్యాంక్స్ తెలియజేశారు. నవంబరు 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read:కాంగ్రెస్ నమ్మించి మోసం చేసింది:నీలం మధు