కాంగ్రెస్ నమ్మించి మోసం చేసింది:నీలం మధు

45
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ తనను నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు ఆ పార్టీ నేత నీలం మధు. టికెట్ అనౌన్స్ చేసి బీ ఫామ్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మధు…బీఎస్పీలో చేరి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ గురువారం రాత్రి ప్రకటించిన తుది జాబితాలో నీలం మధు పేరును తొలగించి కాటా శ్రీనివాస్ గౌడ్‌కు పటాన్‌చెరు టికెట్ కేటాయించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారారు మధు.

ఇక పటాన్ చెరుకు సంబంధించి తన వర్గానికి చెందిన శ్రీనివాస్‌కు టికెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని హెచ్చరించారు దామోదర రాజనర్సింహా. చివరకు తన పంతాన్ని నెగ్గించుకుని పటాన్‌చెరులో శ్రీనివాస్‌కు, నారాయణఖేడ్‌లో సంజీవరెడ్డికి టికెట్ ఇప్పించడంలో సక్సెస్ సాధించారు.

అయితే నారాయణఖేడ్‌ విషయంలో సురేష్ షెట్కార్ – సంజీవ రెడ్డి మధ్య సయోధ్య కుదర్చడంలో కాంగ్రెస్ అధిష్టానం సఫలమైంది. ఇక సూర్యాపేటలో మాత్రం టికెట్ ఆశీంచి భంగపడ్డ పటేల్ రమేశ్ రెడ్డి ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేయనున్నారు.

Also Read:టార్గెట్ అసెంబ్లీ.. గెలుపు సాధ్యమేనా?

- Advertisement -