ఫూలే కృషి చిరస్మరణీయం: మంత్రి కొప్పుల

298
koppula eshwar
- Advertisement -

దేశ, సమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన కృషి చిరస్మరణీయం అన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కరీంనగర్ పట్టణ బై పాస్ రోడ్ లో పూలే విగ్రహానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు .

ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతు… కుల వివక్ష దుర్మార్గమైనది.అది సమూలంగా నిర్మూలింపబడాలని కోరుకున్న దార్శనికుడు పూలే అన్నారు. దేశం అనే దేవాలయానికి బడుగువర్గాలు ప్రాణం, రక్తనాళాల వంటి వాళ్ళు అని అన్నారు.

సామాజిక ప్రజాస్వామ్యం సాధించడం భారత దేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఫూలేను తన గురువుగా భావించారు… బడుగు బలహీన వర్గాలు ఈ వివక్షకు గురి కావడానికి చదువు లేకపోవడమే ముఖ్య కారణమని చాటిచెప్పాడని తెలిపారు.

వెనుకబడిన తరగతుల సంక్షేమం, అందరికీ చదువులు, మహిళా సాధికారత వంటి ఆ మహనీయుని ఆశయాలే స్ఫూర్తిగా మన ప్రభుత్వం ముందుకెళ్తోందని పేర్కొన్నారు.

- Advertisement -