Ponnala:ఫూలే బాటలోనే కేసీఆర్

6
- Advertisement -

గత పది సంవత్సరాలలో కేసీఆర్ నాయకత్వంలో సమాజంలో అసమానతల కోసం అనేక కార్యక్రమాలు చేశారన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ భవన్ లో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నాల..పుట్టుకతో అందరూ సమానంగా పుట్టినప్పుడు ఎందుకు మనుషులు అసమానతలు ఎదుర్కొంటున్నారన్న ప్రశ్న వేసుకోవాలన్నారు.

అందుకే జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజం ఏర్పాటు చేసి సమాజం అందరినీ సమానంగా చూడాలని ప్రయత్నం చేశారన్నారు. కేసీఆర్ గత పది సంవత్సరాల లో బడుగు బలహీన వర్గాల అందరికీ సమానంగా ఆర్థిక రాజకీయ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేశారన్నారు. సమాజంలో అసమానత్వలను తొలగించేందుకు పూలే స్ఫూర్తితో ముందుకు పోదామని ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప సంఘసంస్కర్త మానవతవాది మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు మాజీ స్పీకర్ మధుసూదనాచారి.కాంగ్రెస్ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన బీసీలకు చేస్తున్నది ఏం లేదని… కేసీఆర్ అధిరాకంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేశారన్నారు. ఎవరు ఊహించడానికి సరిపోలేని విధంగా అద్భుతమైన కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టారని..బీసీలను కేవలం రాజకీయాల కోసమే వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ పైన బడుగు బలహీన వర్గాలు కన్నెర్ర చేయడం ఖాయం అన్నారు.

Also Read:ప్రశాంత్ నీల్ నెక్ట్స్‌ ప్రాజెక్ట్ ఇదే!

- Advertisement -