మొక్కలు నాటిన ప్రముఖ సంగీత దర్శకుడు..

140
Music Director Amresh

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రముఖులు తన పుట్టిన రోజును పురస్కరించుకొని మొక్కలు నాటడం జరుగుతుంది. అందులో భాగంగా నేడు చెన్నైలోని తన నివాసంలో తన జన్మదినం సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు అమ్రిష్ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషం, ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక నిజమైన ఛాలెంజ్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి ప్రజలలో మంచి అవగాహన కల్పిస్తూ, చెట్లు నాటే విధంగా ప్రోత్సహిస్తున్న రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.