ఐపీఎల్‌లో ముంబై పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. తాజాగా కోల్ కతాతో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో ఓటమి పాలైంది ముంబై. నైట్ రైడర్స్ విధించిన 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా….113 పరుగులకే చాపచుట్టేసి ఘోర ఓటమిని మూటగట్టుకుంది.రోహిత్ శర్మ (2), తిలక్ వర్మ (6) , రమణ్‌దీప్ (12) విఫలం కాగా కిషన్ (43 బంతుల్లో 51) అర్ధ సెంచరీతో రాణించారు..
ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 165 పరుగులు చేసింది. ఓ దశలో కోల్ కతా స్కోరు 200 దాటుతుందని అంతా భావించినా బుమ్రూ మ్యాజిక్‌తో తక్కువ స్కోరుకే చాపచుట్టేసింది. 4 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రా 5 వికెట్లు తీశాడు. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 43), నితీష్ రాణా (26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 43) రాణించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా బుమ్రా నిలిచాడు.