ఐపీఎల్‌ చరిత్రలోనే.. కోహ్లీ టీం చెత్త రికార్డు

207
Kolkata have got RCB’s number: 7 0 1 8 9 8 2 0 2 5 0
Kolkata have got RCB’s number: 7 0 1 8 9 8 2 0 2 5 0
- Advertisement -

7 0 1 8 9 8 2 0 2 5 0 ఇది ఫోన్‌ నంబర్‌ అనుకుంటే పొరపాటే. ఇది ఐపీఎల్‌లో అత్యంత గట్టి బ్యాటింగ్ లైనప్‌ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్‌-10లో నమోదు అత్యంత చెత్త రికార్డు స్కోరు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డు ఆర్‌సీబీ సొంతమైంది. 132 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగి కూడా 82 పరుగుల తేడాతో చిత్తయింది. 132 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగి కేవలం 49 పరుగులకే కుప్పకూలింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కౌల్టర్‌నైల్‌ (3/21) సంచలన ఓపెనింగ్‌ స్పెల్‌తో బెంగళూరు పతనానికి పునాది వేస్తే.. ఆ తర్వాత వోక్స్‌ (3/6), గ్రాండ్‌హోమ్‌ (3/4) ఆ జట్టు పని పట్టారు. ఆర్‌సీబీ జట్టులో ఒక్కరంటే ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేదు. కేవలం 9.4 ఓవర్లలోనే ఆ జట్టు ఇన్నింగ్స్‌ ముగిసిపోయింది.

అంతకుముందు కోల్‌కతా 19.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. ఆరంభంలో పరుగుల మోత మోగగా.. ఆపై వికెట్ల జాతర సాగింది. ఓపెనర్‌ నరైన్‌ (34; 17 బంతుల్లో 6×4, 1×6) నైట్‌రైడర్స్‌కు మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఆరో ఓవర్లో అతను ఔటయ్యే సమయానికే కోల్‌కతా 65 పరుగులు చేసేసింది. కానీ నరైన్‌ ఔటయ్యాక నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ గాడి తప్పింది. పాండే (15), సూర్యకుమార్‌ (15), వోక్స్‌ (18) మినహా ఎవరూ కాసేపైనా క్రీజులో నిలవలేదు. స్పిన్నర్లు చాహల్‌, నేగి పరుగులు కట్టడి చేస్తూ.. కీలకమైన వికెట్లు పడగొడుతూ కోల్‌కతాను దెబ్బ తీశారు.

- Advertisement -