బాహుబలి టిక్కెట్ల దందా..

169
Baahubali 2 advance booking
Baahubali 2 advance booking
- Advertisement -

ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘బాహుబలి’ చిత్రం ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తెరపై చాలా గ్రాండ్ గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి:ది బిగినింగ్ చూసిన ప్రేక్షకులు.. బాహుబలి: ది కన్‌క్లూజన్‌ని తెరపై చూసి ఆస్వాదించాలని ఉవిళ్లూరుతున్నారు. ఇందుకోసం అడ్వాన్స్ బుకింగ్ ఆరంభమైన రోజే టిక్కెట్స్ బుక్ చేసుకోవడానికి ప్రేక్షకులు ప్రయత్నాలు చేస్తున్నారు. టిక్కెట్ల కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు మల్టీప్లెక్స్‌లు తెరతీశాయి. ప్రేక్షకుల జేబులు గుల్ల చేసేందుకు సిద్ధమయ్యాయి. కాంబో ఆఫర్లు, ఎంట్రీ పాస్‌ల పేరిట నయా దందాకు రంగం సిద్ధం చేశాయి. ఇష్టం ఉన్నా లేకున్నా కూల్‌డ్రింక్, పాప్‌కార్న్ వంటి తినుబండారాలను అమ్ముకుని సొమ్ము చేసుకునే పనిలో పడ్డాయి. దీనికి ప్రత్యేకంగా ‘కాంబో ఆఫర్ల’ పేరుతో టికెట్ ధరను ఏకంగా 75 శాతం పెంచే పెంచేశాయి. దళారులు, మల్టీప్లెక్స్ నిర్వాహకులు కలిసి ఈ దందాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

Bahubali-Theatre-Coverage-17

బాహుబలి2 సినిమాకు కార్పొరేట్ షోల పేరుతో మల్టీప్లెక్స్‌లలో మొదటి మూడు రోజుల టికెట్లన్నీ బల్క్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఇందుకోసం మల్టీప్లెక్స్ నిర్వాహకుల నుంచి ఫుడ్ కూపన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే టికెట్ ధర రూ.150 అయితే కాంబో ఆఫర్ పేరుతో దానిని రూ.250 నుంచి రూ.350 వరకు అమ్ముతున్నారు. దీంతో ఒక్క షో ద్వారానే లక్షలాది రూపాయలు సంపాదించే స్కెచ్ వేశారు. ఇక ఒక్కో టికెట్‌ను రూ.450 పెట్టి కొంటున్న దళారులు వాటిని ఎంట్రీ పాస్‌ల రూపంలో ప్రింట్ చేస్తున్నారు. వాటిపై వివిధ సంస్థల ప్రకటనలను ముద్రించి లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. ఈ పాస్‌లను రూ.1000 వరకు అమ్ముకుంటున్నట్టు చెబుతున్నారు. బ్లాక్ టిక్కెట్స్ ని థియేటర్స్ వారు ప్రోత్సహించి సామాన్యులకు సినిమా చూసే అవకాశాన్ని దక్కకుండా చేస్తున్నాయి థియేటర్ యాజమాన్యాలు. మల్టీప్లెక్స్‌ల దందాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

- Advertisement -