అక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. కీవిస్ విధించిన భారీ లక్ష్యాన్ని చేధించి ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంది కోహ్లీ సేన. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ ..మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి షెడ్యూలింగ్ సరిగ్గా లేదని వ్యాఖ్యానించాడు. తక్కువ వ్యవధిలో మ్యాచ్‌లాడటంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
న్యూజిలాండ్ సమయం భారత్‌కంటే ఏడున్నర గంటలు ముందుంటుంది. ఈక్రమంలో కాస్త త్వరగానే భారత్ ఈ మ్యాచ్‌కు సిద్ధమవ్వాల్సి వచ్చింది. అయితే తాము ఈ మ్యాచ్ కోసం ముందే సిద్ధమయ్యామని, జెట్ లాగ్ లాంటి కారణాలు వెతుక్కోలేదని తెలిపాడు.
ఆక్లాండ్ వన్డేలో భారత్‌కు మద్దతు పలికిన స్థానిక ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పిన కోహ్లీ 200 పరుగల టార్గెట్ ఛేజింగ్‌లో ఫ్యాన్స్ మద్దతు ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా కీవిస్‌ను 210 పరుగుల కంటే తక్కవు స్కోరు చేయడంలో సక్సెస్ సాధించామని అందుకే మ్యాచ్‌ను నిలబెట్టుకోగలిగామని చెప్పారు.