పాలిటిక్స్ కు గుడ్ బై.. అసలెందుకు?

20
- Advertisement -

వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా ? 2024 ఎన్నికలే చివరి ఎన్నికలా ? అంటే అవుననే సమాధానాలు ఏపీ రాజకీయల్లో వినిపిస్తున్నాయి. ఇటీవల కొడాలి నాని మాట్లాడుతూ తన వయసు 53 సంవత్సరాలని 2029 నాటికి 58 ఏళ్ళు వస్తాయని అందువల్ల ఈసారి ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరమవుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. జగన్ కు అత్యంత విధేయత ప్రదర్శించే కొడాలి నాని సడన్ గా ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. గత ఇరవై ఏళ్ళుగా గుడివాడ నియోజక వర్గంలో కొడాలి నాని హవా కొనసాగుతోంది. ప్రత్యర్థి ఎవరైనా ప్రజలు మాత్రం నానినే గెలిపిస్తూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం నానికి గుడివాడలో ప్రజా వ్యతిరేకత పెరిగినట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఆయన మాట్లాడే భాష విధానం, చంద్రబాబు, లోకేష్ లను తరచూ తిట్టడం, ఎవరిని లెక్క చేయని అమర్యాద భావం.. ఆయనకు మైనస్ గా మారినట్లు తెలుస్తోంది. కమ్మసామాజిక వర్గం అధికంగా ఉన్న గుడివాడలో కొడాలి నాని తరచూ చంద్రబాబు, లోకేష్ లను తిట్టడంతో ఆ సామాజిక వర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారట. నిజానికి గత నాలుగు ఎన్నికల్లో కొడాలి నాని గెలుపు వెనుక కమ్మ ఓటర్లదే అధిక పాత్ర. ఇప్పుడు అలాంటి ఓటు బ్యాంకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తుండడంతో కొడాలి నాని రాజకీయాలకు దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇకపోతే ఈసారి టీడీపీ తరుపున గుడివాడలో వెనిగండ్ల రాము పోటీ చేయనున్నారు. నాని పై ఏర్పడ్డ వ్యతిరేకత రాముకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇటు వైసీపీ నుంచి గుడివాడ టికెట్ కొడాలి నానికే కేటాస్తారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఆయనపై ఏర్పడ్డ వ్యతిరేకత జగన్ దృష్టికి చేరినట్లు సమాచారం. అందుకే ఈసారి గుడివాడ టికెట్ వేరే వాళ్ళకు కేటాయించే విధంగా జగన్ ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామలన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొడాలి నాని రాజకీయాలకు దూరం కావాలనే ఆలోచనతో ఉన్నట్లు ఇంటర్నల్ టాక్. మరి ఇప్పటికే పెర్ని నాని యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఇక కొడాలి నాని కూడా దూరమైతే వైసీపీకి గట్టి దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Also Read:Rajamouli: మహేష్ కోసం రాజమౌళి రిస్క్?

- Advertisement -