సపోటాతో ఉపయోగాలు!

36
- Advertisement -

చలికాలం ముగింపు దశ మొదలు కొని వేసవి కాలంలో కూడా దొరికే ఫలాల్లో సపోటా ఒకటి. చూడడానికి బ్రౌన్ కలర్ లోనూ రుచిలో మధురంగా ఉండే సపోటాను చాలమంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. సపోటాకు ఉండే రుచి కారణంగా మిల్క్ షేక్ లలో కూడా ఉపయోగిస్తుంటారు. ఇంకా సపోటాను మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ లలో కూడా ఉపయోగిస్తుంటారు. ఈ సీజన్ లో దొరికే సపోటా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సపోటాలో విటమిన్ ఏ, అధికంగా ఉంటుంది. కాబట్టి కళ్ళకు ఎంతో మంచిది. అలాగే ఇందులో విటమిన్ సి, బి కూడా అధికంగానే ఉంటాయి. తద్వారా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సపోటా ఉపయోగపడుతుంది..

ఇంకా ఇందులో కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి మూలకాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి అవసరమైనవే. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు తరచూ సపోటా తినడం ఎంతో మంచిది. ఎందుకంటే వారిలో శక్తిని పెంచడంలో సపోటా ఎంతో మేలు చేస్తుంది. ఇంకా ఇందులో ఉండే సెలీనియం రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత ఉన్నవాళ్ళు సపోటా తింటే ఎంతో మేలు. ఇందులోని పోషకాలు హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతాయి. ప్రతిరోజూ రెండు లేదా మూడు సపోటా పండ్లు తినడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల సంఖ్య పెరుగుతుంది. తద్వారా సీజనల్ వ్యాధులను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి ఎన్నో ప్రయోజనాలు ఉన్న సపోటాను ప్రతి ఒక్కరూ తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:‘కుబేర’…నాగార్జున ఫస్ట్ లుక్

- Advertisement -