ప్రచారం కోసమే ఎలివేటెడ్ కారిడార్:క్రిశాంక్

19
- Advertisement -

కేవలం ప్రచారం కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఎలివేటెడ్ కారిడార్లకు శంకుస్థాపన చేశారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంత్. హైదరాబాద్ అభివృద్ధిలో కేటీఆర్ పాత్రను తుడిచేయలేమని తెలిపారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన క్రిశాంక్…రక్షణ శాఖ భూములను సాధించడంలో రేవంత్ రెడ్డి పాత్ర శూన్యమన్నారు.

సీఎం రేవంత్‌కు మినిమం నాలెడ్జ్ కూడా లేదని… శ్రమ కేటీఆర్‌ది.. ప్రచారం ఏమో రేవంత్‌ రెడ్డిది అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని గుర్తుచేశారు. కంటోన్మెంట్‌ భూముల విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.

రక్షణ శాఖ భూములను తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించడంలో అసలు రేవంత్‌ రెడ్డి పాత్రే లేదని స్పష్టం చేశారు. ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణాలు ఎలా చేపట్టాలనే దానిపై కేసీఆర్‌ ప్రభుత్వంలో అనేక రాష్ట్రాలకు బృందాలను పంపించి అధ్యయం చేయించారని.. డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ప్రణాళికలు కూడా రూపొందించారని తెలిపారు.రక్షణ శాఖ భూముల అప్పగించాలని గతంతో కేసీఆర్‌ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే.. కేంద్ర రక్షణ శాఖ పుణె కంటోన్మెంట్‌ బోర్డుకు ఓ లేఖ పంపించిందని క్రిశాంక్‌ తెలిపారు.

Also Read:Rajamouli: మహేష్ కోసం రాజమౌళి రిస్క్?

- Advertisement -