మేయర్‌తో KIOSK ఆవిష్కరణ..!

214
mayor
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం లోని నిరుద్యోగ యువతకు ఏదో విధంగా చేయూత నివ్వాలనే తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశ్యానికి తోడుగా నావంతు సహాయంగా ఏదో చేయాలనే ఆలోచనల నుండి KIOSK పుట్టింది. సీఎం కేసీఆర్ ఆశీసులతో మంత్రి కేటీఆర్‌ సహకారంతో ఈ రోజు KIOSK,తెలంగాణ యూత్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీం కింద మొదటగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం ఎదుట జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, తలసాని సాయి కిరణ్ చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం.

ఇది సీఎం కేసీఆర్, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ డైరెక్షన్‌లో ఇంకా KIOSK 400 లతో 3000 మంది వరకు ఉపాధి కల్పించబితోతున్నది అని తలసాని సాయికిరణ్ యాదవ్ తెలిపారు.KIOSK ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుమతులతో జీహెచ్‌ఎంసీ వారు స్థలాన్ని కేటాయిస్తారని, రూపకల్పన చేస్తారని,యువతకు ఇదొక మంచి అవకాశం, ఇది పట్టణ ప్రజల్లో100 సక్సెస్ అవుతున్నందని మేయర్ బొంతు రామ్మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదొక మంచి ఆలోచన, నిరుద్యోగులకు గొప్ప అవకాశం అని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.

- Advertisement -