కళ్యాణ్ దేవ్…కిన్నెరసాని టీజర్

118
kalyandev

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కిన్నెరసాని’. రమణతేజ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుండగా మూవీ ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ ప్రపంచంలో ప్రతీ దానికి ఓ లిమిట్ ఉండాలి.. అది ద్వేషానికైనా.. చివరకు ప్రేమకైనా అనే డైలాగ్ ఆకట్టుకుంది.

సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ – శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి సాగర్ అందించిన నేపథ్య సంగీతం బాగా కుదిరింది. వేద అనే పాత్రలో కళ్యాణ్ దేవ్ కనిపించనున్నారు. ఇక కళ్యాణ్ దేవ్ ఈ సినిమాతో పాటే ‘సూపర్ మచ్చి’ అనే మరో సినిమానూ చేస్తున్నారు.

Kinnerasani Teaser | Kalyaan Dhev | Ramana Teja | Mahathi Swara Sagar |