కాబుల్ ఉగ్రస్ధావరాలపై అమెరికా దాడులు..

258
us
- Advertisement -

కాబూల్ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది అమెరికా. ఐఎస్ ఉగ్రస్థావరాలపై అమెరికా విరుచుకుపడగా వైమానిక దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమైనట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ కెప్టెన్ బిల్ అర్బన్ వెల్లడించారు. అఫ్గన్ బయట నుంచే వైమానిక దాడులను నిర్వహించారు.

గురువారం సాయంత్రం జరిగిన బాంబు పేలుళ్లలో 13 మంది అమెరికా సైనికులు, తాలిబన్లు, అఫ్గన్ పౌరులు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 160 మంది వరకూ గాయపడ్డారు.ఉగ్రదాడి అనంతరం కాబుల్ విమానాశ్రయంలో శుక్రవారం తిరిగి అత్యవసర తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది.

కాబూల్ విమానాశ్రయంలో దాడులకు పాల్పడినవారు ఇంతకు ఇంతా మూల్యం చెల్లించుకుంటారని జో బైడెన్ హెచ్చరించారు. మేము ఎవ్వర్నీ క్షమించం.. ఏదీ మరిచిపోం.. మేము వేటాడి పట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం అని బైడెన్ శపథం చేశారు.

- Advertisement -