మొక్కలు నాటిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు మొగులయ్య

134
gic

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా సైదాబాద్ సింగరేణి కాలనిలో తన నివాసం వద్ద మొక్కలు నాటిన ప్రముఖ కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.

దేశం పచ్చబడాలన్న ,వర్షాలు కురవాలన్న ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారని చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు మొక్కలు నాటలని పాట రూపంలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు మొగులయ్య…