ఐపీఎల్-13లో సోమవారం మరో కీలక మ్యాచ్ జరగనుంది. షార్జా వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లలోనూ స్టార్ బ్యాట్స్‌మెన్ ఉండటంతో ఈ రసవత్తర పోరులో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. చిన్న మైదానం, ఫ్లాట్ వికెట్ కావడంతో షార్జాలో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం టెబుల్‌లో టాప్-4 ప్లేస్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే 14 పాయింట్లతో ప్లేఆఫ్ చేరే అవకాశాలు మరింతగా మెరుగవుతాయి. ఇక వరుస విజయాలతో దూసుకపోతున్న కింగ్స్ ఎలెవన్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.
పంజాబ్ జట్టు: మన్‌దీప్ సింగ్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
కోల్‌కత్తా జట్టు: శుభమాన్ గిల్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (wc), ఎయోన్ మోర్గాన్ (c), సునీల్ నరైన్, పాట్ కమ్మిన్స్, లాకీ ఫెర్గూసన్, కమలేష్ నగర్‌కోటి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి