రైతుల మేలు కోసం కేసీఆర్ రైతు వేదికలు నిర్మిస్తున్నారు- ఎర్రబెల్లి

50
errabelli

కొడకండ్ల మండల కేంద్రంలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాలను సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పనులను త్వరగా పూర్తి చేయండి. రైతు వేదికలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాల్లో పెద్ద మొక్కలు నాటలన్నారు.రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలకు ప్రహరీలుగా పెద్ద మొక్కలు నాటండి. సీఎం కేసీఆర్ రైతుల మేలు కోసం రైతు వేదికలు నిర్మిస్తున్నారు అని మంత్రి పేర్కొన్నారు.