CPL 2020: కేకేఆర్‌ బాటలో కింగ్స్ పంజాబ్‌..!

435
anil kumble
- Advertisement -

ఐపీఎల్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన టీ20 టోర్నిల్లో గుర్తింపు పొందినవి బిగ్ బాష్, కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్‌). ఐపీఎల్ ప్రారంభించిన తర్వాత 2013లో ఈ లీగ్‌ని ప్రారంభించారు. ఈ లీగ్‌కు మంచి ఆదరణ లభిస్తుండగా ఇప్పటికే కోల్ కతా యాజమాన్యం సీపీఎల్‌లో ఓ జట్టును కొనుగోలు చేసింది.

తాజాగా కేకేఆర్ బాటలోనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేరనుంది. సీపీఎల్‌లోని సెయింట్ లూసియా జౌక్స్‌ జట్టును కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నామని పంజాబ్ యజమాని నెస్ వాడియా తెలిపారు. అన్ని అనుకున్నట్లు జరిగితే సీపీఎల్‌లో అడుగుపెడతామని చెప్పారు.

2015లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ….ట్రిన్బాగో నైట్ రైడ‌ర్స్ జ‌ట్టును కొనుగోలు చేసింది. సీపీఎల్‌లోనే అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్టు టీకేఆర్ కావ‌డం విశేషం. ఈ టోర్నీని మూడుసార్లు టీకేఆర్ కైవ‌సం చేసుకుంది. ఈ ఏడాది సీపీఎల్ ఆగ‌స్టు 19 నుంచి సెప్టెంబ‌ర్ 26 మ‌ధ్య జ‌రగనుంది.

- Advertisement -