టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌..

191

ఐపీఎల్‌-13లో భాగంగా రెండో మ్యాచ్‌ జరుగనుంది.. దుబాయ్‌ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్న రెండు జట్లకు ఈ మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం కావడంతో పోరు హోరాహోరీగా సాగనుంది. ఇరు జట్లు చెరో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లతో ఉన్నాయి.

జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇక పంజాబ్ టీమ్‌లో రెండు మార్పులు చేశారు. మయాంక్ అగర్వాల్, జిమ్మీ నీషమ్ స్థానంలో మన్‌దీప్ సింగ్, క్రిస్ జోర్డాన్ జట్టులోకి వచ్చారు.