గౌతమ్‌ను తల్లి ఒడికి చేర్చిన ఎస్పీ భాస్కరన్..

254
sp baskaran
- Advertisement -

సూర్యపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్‌లో ఈ నెల 14న సాయంత్రం గౌతమ్ అనే ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును పోలీసులు చేధించి సోమవారం బాలుడిని సేఫ్ చేశారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పజెప్పారు పోలీసులు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకొని అన్ని కోణాల్లో విచారణ మొదలు పెట్టారు పోలీసులు.. పోలీసుల కదలికలు బయటికి పొక్కకుండా రహస్యంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఫలితంగా 24 గంటల్లో బాలుడి ఆచూకిని కనిపెట్టారు. దీని సంబంధించిన పూర్తి వివరాలు జిల్లా ఎస్పీ భాస్కరన్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్పీ భాస్కరన్ మాట్లాడుతూ… దీపావళి పండుగ రోజు బాలుడు గౌతమ్ కిడ్నాప్ చేసింది డబ్బుల కోసమే.13వ తేదీన రెక్కీ నిర్వహించి సూర్యపేటలో ఓ లాడ్జిలో ఉండి 14వ తేదీన బాబును కిడ్నాప్ చేశారు. బాబును మొదట మిర్యాలగూడకు తీసుకెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లారు. ముగ్గురు కిడ్నాపర్లు గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని రెండు గ్రామాలకు చెందిన వారిగా గుర్తించాం,ఈజీ మనీ కోసమే కిడ్నాప్ చేశారు.

నిందితులు బాటసారుల ఫోన్ లను అడుక్కొని వాటితో బాలుడి తండ్రికి ఫోన్ చేసి 10 లక్షలు డిమాండ్ చేశారు. 7లక్షలకు ఒప్పందం కుదరడంతో డబ్బుల కోసం మళ్లీ ఫోన్ చేశారు. డబ్బులు ఇచ్చే క్రమంలో వల వేసి పట్టుకున్నాం. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు, నిందితులు ఒక్కసారి వారి సొంత సిమ్ కార్డు నుంచి ఫోన్ చేయడంతో నిందితుల ఆచూకీ కనిపెట్టగలిగామని ఎస్పీ భాస్కరన్ వెల్లడించారు.

- Advertisement -