‘ఆహా’.. సమంత పారితోషికం ఎంతో తెలుసా..!

376
Samantha
- Advertisement -

టాలీవుడ్‌ హీరోయిన్ సమంత అక్కినేని ‘ఆహా’ ఓటీటీకి ఓ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ కోసం సమంతకు బాగానే పారితోషకం ముట్టిందనే వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినబడుతున్నాయి. ఓవైపు సినిమాలు.. మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేస్తూనే సమంత ఫుల్ బిజీగా ఉంది.

‘సామ్ జామ్’ పేరిట రూపొందుతున్న ఈ షోలోని మొదటి భాగంలో హీరో విజయ్ దేవరకొండ సెలబ్రిటీగా వచ్చాడు. త్వరలో చిరంజీవి కూడా దీనికి హాజరుకానున్నారని, అలాగే అల్లు అర్జున్, రష్మిక, తమన్నా వంటి తారలు కూడా వస్తారని చెబుతున్నారు.

ఇక ఈ షోకి హోస్టుగా వ్యవహరిస్తున్నందుకు సమంతకు ఒక్కో ఎపిసోడ్ కి 15 లక్షల చొప్పున మొత్తం పది ఎపిసోడ్లకు కోటిన్నర ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పారితోషికం పరంగా చూస్తే.. ఒక విధంగా ఇది సినిమాల లాగానే తారలకు వర్కౌట్ అవుతున్నట్టు చెబుతున్నారు.

- Advertisement -